ముత్తూట్‌ ఫైనాన్స్‌ లాభం రూ.483 కోట్లు | Muthoot Finance has a net profit of Rs 483 crore | Sakshi
Sakshi News home page

ముత్తూట్‌ ఫైనాన్స్‌ లాభం రూ.483 కోట్లు

Dec 7 2018 4:47 AM | Updated on Dec 7 2018 4:47 AM

Muthoot Finance has a net profit of Rs 483 crore - Sakshi

న్యూఢిల్లీ: ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.484 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.446 కోట్ల నికర లాభం సాధించామని, 9 శాతం వృద్ధి సాధించామని ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీ తెలిపింది. గత క్యూ2లో రూ.1,662 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,650 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేర్‌ 7.1 శాతం నష్టంతో రూ.416 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement