హైదరాబాద్ లో ఎంఫసిస్ కేంద్రం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఎంఫసిస్ కేంద్రం

Published Thu, Aug 4 2016 1:25 AM

హైదరాబాద్ లో ఎంఫసిస్ కేంద్రం - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐటీ సొల్యూషన్స్, సర్వీసుల రంగంలో ఉన్న ‘ఎంఫసిస్’... హైదరాబాద్‌లో కాగ్నిటివ్ హబ్‌ను ప్రారంభించింది. ఆర్థిక సేవల రంగ కంపెనీలకు ఈ కేంద్రం తదుపరి తరం గవర్నెనెన్స్, రిస్క్, కాంప్లియన్స్ పరిష్కారాలను అందిస్తుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. 250 సీట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు కంపెనీ సీఈవో గణేష్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపారు. మరిన్ని హబ్‌లను పలు నగరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement