మోటో జీ4 వచ్చేస్తోంది | Moto G4 (4th) or Moto G 2016 Plus lauch on may17 | Sakshi
Sakshi News home page

మోటో జీ4 వచ్చేస్తోంది

May 16 2016 2:54 PM | Updated on Sep 4 2017 12:14 AM

మోటో జీ4  వచ్చేస్తోంది

మోటో జీ4 వచ్చేస్తోంది

మోటోరోలా సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ4'ను రేపు విడుదల చేయనుంది.

న్యూఢిల్లీ:  మోటోరోలా సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ4'ను   మంగళవారం భారత మార్కెట్లో  విడుదల  కానుంది. మోటో జీ3 స్మార్ట్ ఫోన్ కు  అప్ గ్రేడెడ్ మోడల్గా రాబోతోన్న మోటో జీ4 వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. మోటో. ఈ నెల 17న  మార్కెట్ లో విడుదల కానుండగా ఈ  ఫోన్ కు సంబంధించి ఆసక్తికర రూమర్స్ ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి.   అయితే దీని ధర వివరాలను ఇంకా వెల్లడి కావాల్సిఉంది.  లాంచింగ్ ముందే గ్రీక్ బెంచ్  వెబ్ సైట్ లో ఈ ఫోన్  కు సంబంధించిన వివరాలు లభ్యమయ్యాయి.
ఈ- కామర్స్ వెబ్ సైట్ లో అమెజాన్ తమ ఫోన్లు అందుబాటులో ఉంచనున్నట్టు ఇటీవల మోటరోలా   ఇండియా హెడ్  అమిత్ బోనీ ఒక ప్రకటనలో తెలిపారు.  భారత మార్కెట్ లో తమకు డిమాండ్ భారీగా పెరిగిందని పేర్కొన్నారు.

మోటో జీ4 ఫీచర్లు ఇలా ఉన్నాయి...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1
920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.2 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మాలో
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వాటర్ రెసిస్టెంట్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Advertisement
Advertisement