మోటో ఈ5 ప్లస్‌ ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ | Moto E5 Plus Live Images Have Surfaced Online | Sakshi
Sakshi News home page

మోటో ఈ5 ప్లస్‌ ఆన్‌లైన్‌లో హల్‌చల్‌

Mar 20 2018 5:10 PM | Updated on Mar 20 2018 5:10 PM

Moto E5 Plus Live Images Have Surfaced Online - Sakshi

మోటో ఈ5 ప్లస్‌ లీక్‌

లెనోవోకు చెందిన మోటో తన కొత్త స్మార్ట్‌ఫోన్లను వచ్చే కొన్ని నెలలో మార్కెట్‌లోకి తీసుకురాబోతుందట. మోటో జీ6 లైన్‌, మోటో జడ్‌3, మోటో జడ్‌3 ప్లే, మోటో ఈ5 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను మోటో మార్కెట్‌లో ప్రవేశపెడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మోటో ఈ5 ప్లస్‌ లైవ్‌ ఇమేజ్‌లు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫ్రంట్‌, బ్యాక్‌ ఈ ఫోన్‌ ఎలా ఉండబోతుందో ఈ లైవ్‌ ఇమేజ్‌ల ద్వారా తెలుస్తోంది. స్లిమ్‌ బెజెల్స్‌తో  18:9 డిస్‌ప్లేను ఈ ఫోన్‌ కలిగి ఉంటుందని లైవ్‌ ఇమేజస్‌ రివీల్‌ చేస్తున్నాయి. 5.5 అంగుళాల సైజు, హెచ్‌డీ ప్లస్‌ రెజుల్యూషన్‌ ఇది కలిగి ఉండబోతుందని తెలుస్తోంది.  వెనుకాల ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, మోటో లోగోతో కర్వ్‌డ్‌ గ్లాస్‌ ఉన్నట్టు రియర్‌ ప్యానల్‌ చూపిస్తోంది.

మోటో ఎక్స్‌4 లాగానే ఇది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ముందు వైపు ఒక్కటే కెమెరా ఉండి, అది ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో ఉండబోతోంది. మిగతా పార్ట్‌ల గురించి ఈ లైవ్‌ ఇమేజ్‌లు ఎక్కువగా రివీల్‌ చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌430 ఎస్‌ఓసీ, ఆండ్రాయిడ్‌ ఓరియో, అతిపెద్ద 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మోటో ఈ5 ప్లస్‌తో పాటు మోటోరోలా మోటో ఈ5ను కూడా లాంచ్‌ చేస్తుందని తెలుస్తోంది. అది 5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండబోతోందట. అయితే మోటో ఈ5, మోటో ఈ5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏప్రిల్‌ 3న వీటిని లాంచ్‌ చేయనున్నట్టు కొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

1
1/1

మోటో ఈ5 ప్లస్‌ లైవ్‌ ఇమేజ్‌లు

Advertisement

పోల్

Advertisement