
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ రుణ బకాయిలు రాబట్టుకునే విషయంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ)లో కేసు దాఖలుకు అవసరమైన మొత్తాల పరిమితిని గురువారం కేంద్రం రూ. 20 లక్షలకు పెంచింది. ఆర్థికశాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇప్పటి వరకూ ఈ పరిమితి 10 లక్షలు. దీనివల్ల ఇకపై రూ.20 లక్షల పైబడిన బకాయిలను రాబట్టుకోడానికి మాత్రమే డీఆర్‌టీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆశ్రయించగలుగుతాయి. డీఆర్‌టీలో అధిక సంఖ్యలో కేసులు పేరుకుపోతుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. దేశంలో 39 డీఆర్‌టీలు ఉన్నాయి.