మిస్డ్ కాల్‌తో సమాచారం | Missed call based search engine launched | Sakshi
Sakshi News home page

మిస్డ్ కాల్‌తో సమాచారం

Feb 27 2015 3:20 AM | Updated on Sep 2 2017 9:58 PM

మిస్డ్ కాల్‌తో సమాచారం

మిస్డ్ కాల్‌తో సమాచారం

ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. సమాచారం క్షణాల్లో అందించేందుకు హైదరాబాద్‌...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. సమాచారం క్షణాల్లో అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎస్ ఫ్రీ టు డయల్ కమ్యూనికేషన్స్ ‘ఫ్రీ టు డయల్’ పేరుతో సేవలను ప్రారంభించింది. రెస్టారెంట్లు, ఫుడ్, దుస్తులు, క్లినిక్స్, విద్య.. ఇలా సమాచారం ఏదైనా 040-66444466 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ప్రతిగా కంపెనీ ప్రతినిధి కాల్ చేసి కస్టమర్‌కు కావాల్సిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా అందిస్తారు. అటు వెండార్‌కు కూడా ఈ సమాచారం వెళ్తుంది.

ప్రస్తుతం 2 వేలకుపైగా వెండార్లతో చేతులు కలిపినట్టు కంపెనీ డెరైక్టర్ సునీల్‌కుమార్ సింగ్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. వైజాగ్, విజయవాడ, బెంగళూరు నగరాలకూ విస్తరించాలన్నది ప్రణాళిక. ఇప్పటి వరకు కంపెనీ రూ.3 కోట్లు వెచ్చించింది. ఫ్రీటుడయల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ సర్చ్ ఇంజన్ సేవలను అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement