ఆర్థిక సంవత్సరం పొడిగింపు... నిజంకాదు!

Ministry of Finance Comments On Financial Year Extension - Sakshi

ఆర్థికశాఖ వివరణ

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 2019 నుంచీ ప్రారంభమై మార్చి 2020తో ముగిసే 2019–2020 ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు అంటే జూన్‌ నెలాంతం వరకూ పొడిగించినట్లు సోమవారం వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక వివరణాత్మక ప్రకటన చేసింది. ఆర్థిక సంవత్సరం పొడిగింపు జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.  దీని ప్రకారం ఆర్థికశాఖ కింద పనిచేస్తున్న రెవెన్యూ శాఖ 30వ తేదీన ఇండియన్‌ స్టాంప్స్‌ యాక్ట్‌లో కొన్ని సవరణలకు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిని కొన్ని మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి.

‘‘స్టాక్‌ ఎక్సే్చంజీలు లేదా క్లీనింగ్‌ కార్పొరేషన్‌ల ద్వారా జరిగే సెక్యూరిటీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్ల లావాదేవీలపై స్టాంప్‌ డ్యూటీ వసూళ్లకు 2020 ఏప్రిల్‌ 1 నుంచీ పటిష్ట యంత్రాంగం అమల్లో ఉంటుందని గత నోటిఫికేషన్‌ ఒకటి తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ యంత్రాగం అమలును 2020 జూలై 1వ తేదీ వరకూ వాయిదా వేయడం జరిగిందని రెవెన్యూ శాఖ మార్చి 30వ తేదీన ఒక ప్రకటన ఇచ్చింది. దీనిని కొన్ని మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి’’ అని ఆర్థికశాఖ ప్రకటన మంగళవారం వివరణ ఇచ్చింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top