గూగుల్ స్టార్టప్ ప్రొగ్రామ్‌కు... మై మెడికేర్ | Medicare changes set for election battleground, as ACTU pledges campaign | Sakshi
Sakshi News home page

గూగుల్ స్టార్టప్ ప్రొగ్రామ్‌కు... మై మెడికేర్

Feb 17 2016 1:52 AM | Updated on Sep 3 2017 5:46 PM

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మై మెడికేర్ సార్టప్ గూగుల్ స్టార్టప్ ప్రొగ్రామ్‌కు ఎంపికైంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మై మెడికేర్ సార్టప్ గూగుల్ స్టార్టప్ ప్రొగ్రామ్‌కు ఎంపికైంది. ఈనెల 28న క్యాలిఫోర్నియాలో జరగనున్న ఈ కార్యక్రమంలో 80 దేశాల్లోని 200 నగరాల నుంచి 50 ఉత్తమ కంపెనీలు పాల్గొననున్నాయి. ఆ 50 కంపెనీల్లో మై మెడికేర్ ఒకటని సంస్థ సీఈఓ శ్రీనివాస్ తుమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మై మెడికేర్ పనేంటంటే.. వైద్యులను, క్లినిక్స్, మందుల దుకాణాలను, డయోగ్నస్టిక్ సెంటర్లను ఒకే వేదిక తీసుకొచ్చింది. దీంతో పేషెంట్లు తమకు అవసరమైన సేవలను క్లిక్ దూరంలోనే వినియోగించుకోవచ్చన్నమాట.

Advertisement
 
Advertisement
Advertisement