బ్యాంకుల రీబౌండ్‌, 200 పాయింట్లు జంప్‌ | markets rebound, gains 200 points | Sakshi
Sakshi News home page

బ్యాంకుల రీబౌండ్‌, 200 పాయింట్లు జంప్‌

Dec 4 2019 3:19 PM | Updated on Dec 4 2019 4:53 PM

markets rebound, gains 200 points - Sakshi

సాక్షి, ముంబై :   దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఆరంభ నష్టాలనుంచి  సూచీలు మిడ్‌ సెషన్‌కు మరింత క్షీణించాయి. తిరిగి పుంజుకున్నాయి. లాభనష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడుతూ సెన్సెక్స్‌ ప్రస్తుతం 203 పాయింట్లు ఎగిసి 40870 వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు ఎగిసి 12048 వద్ద కొనసాగుతోంది.

ముఖ్యంగా  ప్రైవేట్, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో  నిఫ్టీ ఇండెక్స్‌ ఇంట్రాడే కనిష్టస్థాయి 31,444.00 నుంచి 434 పాయింట్లు లాభపడి 31,878.35 స్థాయిని అందుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా ఉండగా, యస్‌బ్యాంక్‌,  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌,  ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌  లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ మాత్రం స్వల్పంగా నష్టపోతున్నాయి.  టాటా మోటార్స్‌, వేదాంతా, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా ఓఎన్‌జీసీ లాభపడుతున్నాయి. మరోవైపు రిలయన్స్‌, కోల్‌ ఇండియా, ఐవోసీ, మారుతి సుజుకి ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement