‘బోయింగ్ జేవీ’ తో.. మేక్ ఇన్ తెలంగాణకు ఊతం | make in telangana rise in Boeing J. V. | Sakshi
Sakshi News home page

‘బోయింగ్ జేవీ’ తో.. మేక్ ఇన్ తెలంగాణకు ఊతం

Dec 3 2015 1:35 AM | Updated on Sep 3 2017 1:23 PM

‘బోయింగ్ జేవీ’ తో.. మేక్ ఇన్ తెలంగాణకు ఊతం

‘బోయింగ్ జేవీ’ తో.. మేక్ ఇన్ తెలంగాణకు ఊతం

విమానయాన రంగ దిగ్గజం బోయింగ్ రాక తెలంగాణకు మరింత విలువ చేకూరుస్తుందని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) అన్నారు.

ఏరోక్యాంపస్ అక్విటైన్‌తో కలిసి ఏవియేషన్ అకాడమీ
 తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
: విమానయాన రంగ దిగ్గజం బోయింగ్ రాక తెలంగాణకు మరింత విలువ చేకూరుస్తుందని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) అన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ విడిభాగాల తయారీ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ యత్నాలకు ఊతమిస్తుందని తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన బోయింగ్ సప్లయర్స్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ‘తెలంగాణకు మరిన్ని కంపెనీలు వచ్చేందుకు బోయింగ్-టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌ల జాయింట్ వెంచర్ దోహదం చేస్తుంది. బోయింగ్‌కు విడిభాగాలు సరఫరా చేసే కంపెనీలు హైదరాబాద్‌కు వస్తాయి.
 
  ఇప్పటికే ఇక్కడ కార ్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇది చక్కని అవకాశం. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు పూర్తి సహకారం ఉంటుంది’ అని తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఏరోక్యాంపస్ అక్విటైన్‌తో కలిసి ఏవియేషన్ అకాడమీ ఏర్పా టు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రాట్ అండ్ విట్నీ తన హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరించే అవకాశం ఉందన్నారు.
 
 అపాచీ హెలికాప్టర్ల విడిభాగాల తయారీ...
 హైదరాబాద్ కేంద్రంలో తొలుత అపాచీ హెలికాప్టర్ల ప్రధాన విడిభాగాలను తయారు చేయనున్నట్టు బోయింగ్  ఇండియా ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్ తెలిపారు.భవిష్యత్తులో అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి జేవీ ఊతమిస్తుందని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సీఈవో సుకరన్ సింగ్ చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో అవకాశాలను అందుకోవడానికై టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్(టీఏఎస్‌ఎల్), బోయింగ్‌లు జూలైలో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల భాగస్వామ్య కంపెనీ ఆదిభట్ల వద్ద ఫెసిలిటీని నెలకొల్పనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 8.5 ఎకరాలను కేటాయించింది. ఈ ఫెసిలిటీకై జేవీ సుమారు రూ.400 కోట్లు వెచ్చించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement