'మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కండి' | Telangana Minister ktr meeting with nri's in dallas | Sakshi
Sakshi News home page

'మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కండి'

May 10 2015 8:41 AM | Updated on Jul 6 2019 12:42 PM

'మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కండి' - Sakshi

'మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కండి'

మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కావాలని ఆ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు.

హైదరాబాద్: మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కావాలని ఆ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు.  యూఎస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఆదివారం డల్లాస్లో నిర్వహించిన ఐటీ సర్వ్ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ కంపెనీ ప్రతినిధులు, ఎన్నారైలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై కేటీఆర్ ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

తెలంగాణలో కంపెనీలు పెడితే ప్రభుత్వపరంగా అన్నివిధాల సహకారం అందిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా ఎన్నారైలకు హామీ ఇచ్చారు. కేటీఆర్ రెండు వారాల అమెరికా పర్యటనలో మే 5వ తేదీ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.  ఆయన మే 16వ తేదీన భారత్ తిరిగి ప్రయాణం అవుతారు.

Advertisement
 
Advertisement
Advertisement