ఎల్‌జీ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ | LG Candy budget smartphone in India | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌

Aug 30 2018 2:39 PM | Updated on Aug 30 2018 2:48 PM

LG Candy budget smartphone in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఎల్‌జీ బడ్జెట్‌ ధరలో ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎల్‌జీ క్యాండీ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం  భారత మార్కెట్లో లాంచ్‌​  చేసింది.  దీని ధరను రూ .6,999 గా  నిర్ణయించింది. బ్లూ, సిల్వర్‌, గోల్డ్‌ రంగుల్లో మూడు అదనపు వెనక కవర్లను కూడా అందిస్తోంది. సెప్టెంబరు 1 నుంచి ఎల్‌జీ  క్యాండీ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని కంపనీ  వెల్లడించింది.  శరవేగంగా  అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో అందమైన కవర్లు, కెమెరా టెక్నాలజీ,  ఇతర ప్రధాన ఫీచర్లతో  తమ ఎల్‌జీ కాండీ వినియోగదారుల మనసు దోచుకుంటుదని ఎల్‌జీ ఇండియా బిజినెస్‌హెడ్‌( మొబైల్స్‌) అద్వైత్ వైద్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఎల్‌జీ  క్యాండీ ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
3 గిగా హెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
1280x720 రిజల్యూషన్‌
2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌
32 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
8 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్పీ కెమెరా
2500  ఎంఏహెచ్‌  బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement