మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

JioPhone Monsoon Hungama Offer Registration Opens - Sakshi

ముంబై : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇటీవలే తన 41వ వార్షిక సాధారణ సమావేశాన్ని ముంబైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కంపెనీ పెద్ద పెద్ద ప్రకటనలో చేసింది. జియో గిగాఫైబర్‌ లాంచింగ్‌, జియో ఫోన్‌ హై ఎండ్‌ మోడల్‌ జియో ఫోన్‌2 విడుదల, జియోఫోన్‌లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ యాప్‌లు అందుబాటు వంటి వాటిని ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ కూడా ఒకటి. అత్యంత తక్కువ ధరకు ఎవరైతే జియోఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికే ఈ జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌. పాత ఫీచర్‌ ఫోన్‌ ఎక్స్చేంజ్‌ చేసి కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే పొందవచ్చు. 

జూలై 21 నుంచి జియో మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్‌ రిజిస్ట్రేషన్లను కంపెనీ ప్రారంభించింది. ‘రిజిస్టర్‌ యువర్‌ ఇంటరెస్ట్‌’ గా జియో ఈ ప్రాసెస్‌ను మొదలుపెట్టింది. ఈ ఆఫర్‌ను రిజిస్ట్రర్‌ చేయాలనుకునే వారు, జియో.కామ్‌ లేదా మైజియో యాప్‌లోకి లాగిన్‌ అయి, ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దానిలో అడిగిన వివరాలను నమోదు చేసిన అనంతరం, నియమ, నిబంధనలను అంగీకరించి, వ్యాపారం లేదా వ్యక్తిగతం అనే దాన్ని క్లిక్‌ చేయాలి. ఆ అనంతరం సబ్‌మిట్‌ బటన్‌ నొక్కాలి. ఈ ప్రక్రియ అనంతరం జియో మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ను రిజిస్టర్‌ చేసుకున్నట్టు మీ ఈ-మెయిల్‌కు లేదా ఎస్‌ఎంఎస్‌ రూపంలో మెసేజ్‌ వస్తుంది. జియో తొలుత మార్కెట్‌లో సిమ్‌ కార్డులను లాంచ్‌ చేసినప్పటి నుంచి ఇదే ప్రక్రియను అనుసరిస్తోంది. ఎవరైతే ముందస్తు బుకింగ్‌ లేదా రిజిస్టర్‌ చేసుకుంటారో వారికి ఇతరుల కంటే ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. 

జియోఫోన్‌ కూడా ఇదే ప్రక్రియను రిలయన్స్‌ అనుసరించింది.  అయితే తాజాగా చేపడుతున్న రిజిస్ట్రేషన్లు కస్టమర్లను క్యూలైన్ల నుంచి కాపాడలేవని తెలుస్తోంది. ఇది, కేవలం ఆఫర్‌ అందుబాటులోకి రావడానికి ముందే ఎన్ని డివైజ్‌లు అందుబాటులో ఉంటున్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిసింది. ఈ రిజిస్ట్రేషన్‌తో ఆఫర్‌ లైవ్‌లోకి వచ్చే సమయంలో యూజర్లకు నోటిఫికేషన్‌ అలర్ట్‌ను కంపెనీ పంపిస్తుందని, దీంతో స్టోర్‌ వద్దకు వెళ్లి త్వరగా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వీలవుతుందని తెలిసింది. ఆధార్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను జియో స్టోర్‌కు తీసుకెళ్తే, మాన్‌సూన్‌ ఆఫర్‌లో జియోఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top