జియో యూజర్స్‌కు గుడ్‌న్యూస్‌ | Jio Phone Diwali Offer 2019 Extended Another Month | Sakshi
Sakshi News home page

జియో ఫోన్‌.. ఆఫర్‌ పొడిగింపు

Nov 1 2019 8:14 PM | Updated on Nov 1 2019 8:14 PM

Jio Phone Diwali Offer 2019 Extended Another Month - Sakshi

దీపావళి ఆఫర్‌ను అందరూ వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని పొడిగించినట్టు పేర్కొంది.

సాక్షి, ముంబై: ‘జియో ఫోన్‌ దీపావ‌ళి 2019 ఆఫ‌ర్‌`కు అనూహ్య స్పందన వచ్చిందని రిలయన్స్‌ తెలిపింది. రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ.699కే అందించి మూడు వారాల పాటు కొనసాగించిన ఈ ఆఫర్‌కు ఊహించనంత డిమాండ్‌ వచ్చిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్‌ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులందరూ దీపావళి ఆఫర్‌ను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని పొడిగించినట్టు పేర్కొంది. 2జీ ఫోన్‌ వినియోగదారులు ఈ పొడిగింపుతో తమ ఖాతాదారులుగా మారతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 4జీ డివైస్‌ ప్లాట్‌ఫామ్‌లో నంబర్‌వన్‌గా రిలయన్స్‌ జియో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

సూపర్‌ ఆఫర్‌ ఇలా..
దీపావ‌ళి 2019 ఆఫ‌ర్‌లో భాగంగా జియో ఫోన్‌పై రూ. 800 తగ్గింపు, రూ.700 విలువైన డాటా, మొత్తం క‌లిపి రూ.1500 ప్ర‌యోజ‌నం ప్ర‌తి జియో ఫోన్ వినియోగ‌దారుడికి అందించింది. కొత్తగా కొనుగోలు చేసే జియోఫోన్‌పై రూ.700 విలువ చేసే డాటాను అందిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారుడి చేసుకునే ఒక్కో రీచార్జ్‌కు అదనంగా రూ.99 విలువైన డాటాను జియో అందిస్తుంది. మొద‌టి ఏడు రీచార్జ్‌ల‌కు రూ.99 విలువైన డాటాను జియో అదనంగా జ‌త‌చేయ‌నుంది. ఈ డాటాతో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పేమెంట్స్‌, ఈకామ‌ర్స్‌, విద్య, శిక్ష‌ణ‌, రైలు, బ‌స్ బుకింగ్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ యాప్‌లు మ‌రెన్నో సౌకర్యాలు పొందుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement