విప్రో,ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ ర్యాలీ...ఐటీ ఇండెక్స్‌ 2% అప్‌ | it index 2 percent up | Sakshi
Sakshi News home page

విప్రో,ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ ర్యాలీ...ఐటీ ఇండెక్స్‌ 2% అప్‌

May 27 2020 4:13 PM | Updated on May 27 2020 4:16 PM

it index 2 percent up - Sakshi

బుధవారం ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లు జోరుగా ర్యాలీచేశాయి. నిఫ్టీఐటీ ఇండెక్స్‌ 2.7 శాతం లాభపడి రూ.13,952.90 వద్ద ముగిసింది. ఉదయం సెషన్‌లో నిఫ్టీఐ ఇండెక్స్‌ రూ.13,667 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ.14,017 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక ఈ ఇండెక్స్‌లో భాగమైన విప్రో 6.8 శాతం లాభపడి రూ.201.80 వద్ద, ఇన్ఫోసిస్‌ 3.7 శాతం లాభపడి రూ.706.20 వద్ద, టీసీఎస్‌ 3.3 శాతం లాభపడి రూ.2,008 వద్ద ముగిసాయి.హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌మహీంద్రా,ఇన్ఫోటెక్‌, మైండ్‌ట్రీ, హెక్సావేర్‌, జస్ట్‌డైల్‌లు 0.2  శాతం నుంచి 0.60 శాతం లాభపడి ముగిసాయి. ఇక ఈ ఇండెక్స్‌లోని మరో కంపెనీ టాటా ఎలక్సీ మాత్రం 1.4 శాతం నష్టపోయి రూ.749 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement