ఫార్చ్యూన్ నెక్స్ట్ 500లో జస్ట్డయల్, ఐఆర్సీటీసీ | Sakshi
Sakshi News home page

ఫార్చ్యూన్ నెక్స్ట్ 500లో జస్ట్డయల్, ఐఆర్సీటీసీ

Published Fri, Jun 17 2016 12:27 AM

ఫార్చ్యూన్ నెక్స్ట్ 500లో  జస్ట్డయల్, ఐఆర్సీటీసీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది  ఫార్చ్యూన్ నెక్స్‌ట్ 500 భారతీయ కంపెనీల జాబితాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ వెల్లడించింది. జస్ట్ డయల్, యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, ఐఆర్‌సీటీసీ తదితర  సంస్థల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో చోటు సాధించిన కంపెనీల్లో చాలా వరకూ మిడ్ సైజ్ కంపెనీలు. ఈ కంపెనీలను స్మాల్ వండర్స్‌గా ఈ మ్యాగజైన్ అభివర్ణించింది. ఈ జాబితాలో చోటు సాధించిన కంపెనీలు ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. వివరాలు..,

 ఈ జాబితాలో డైనమాటిక్ టెక్నాలజీస్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. రూ.1,693 కోట్ల వార్షిక ఆదాయంతో ఈ కంపెనీ ఈ ఘనత సాధించింది.

 ఆ తర్వాతి స్థానాల్లో నెక్టార్ లైఫ్‌సైన్స్(రూ.1,692 కోట్లు),  ఓస్వాల్ ఉలెన్ మిల్స్(రూ.1,689 కోట్లు), వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్(రూ.1,682.5 కోట్లు), హిటాచి హోమ్ అండ్ లైఫ్ సొల్యూషన్స్(రూ.1,682 కోట్లు)లు ఉన్నాయి.

 నెక్స్‌ట్ 500 జాబితాలోని మొత్తం కంపెనీల ఆదాయం రూ.5,14,788 కోట్లుగా ఉంది. ఒక్కో కంపెనీ సగటు ఆదాయం రూ.1,000 కోట్ల పైమాటే.

 ఈ జాబితాలో చోటు సాధించిన కంపెనీలు వివిధ రంగాలకు చెందినవి. ఈ కంపెనీలు బేసిక్ మెటీరియల్స్, ఆర్థిక సేవలు, ఆహారం,వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, ఇనుము, ఉక్కు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

 టాప్10లో ఉన్న కంపెనీల్లో కొన్ని-గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొ, లుకాస్-టీవీఎస్,గతి, అడెక్కో ఇండియా, జిందాల్ అల్యూమినియం,

 ఇండియన్ రైల్వేస్ టూరిజమ్ అండ్ కేటరింగ్ విభాగం ఐఆర్‌సీటీసీ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. గత ఏడాది జాబితాలో 328గా ఉన్న ఈ కంపెనీ ర్యాంక్ ఈసారి జాబితాలో 199కు పెరిగింది.

 ఈ జాబితాలో తొలిసారిగా చేరిన యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి 442, జస్ట్ డయల్ కంపెనీకి 449 ర్యాంక్‌లు లభించాయి.

 ఇటీవలే ఐపీఓకు వచ్చిన నారాయణ హృదయాలయ, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్ కంపెనీలు ఈ జాబితాలో స్థానాలు సాధించాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement