వేవ్‌రాక్‌లో టిష్‌మెన్ స్పేయర్స్ పెట్టుబడులు! | Investments in Wave Rock tismen speyars | Sakshi
Sakshi News home page

వేవ్‌రాక్‌లో టిష్‌మెన్ స్పేయర్స్ పెట్టుబడులు!

Oct 24 2015 1:39 AM | Updated on Sep 3 2017 11:22 AM

వేవ్‌రాక్‌లో టిష్‌మెన్ స్పేయర్స్ పెట్టుబడులు!

వేవ్‌రాక్‌లో టిష్‌మెన్ స్పేయర్స్ పెట్టుబడులు!

హైదరాబాద్‌లోని వేవ్‌రాక్ ఆఫీస్ ప్రాజెక్ట్‌లో సింగపూర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ టిష్‌మెన్ స్పేయర్స్ భారీ పెట్టుబడులు పెట్టింది...

- రూ.1,000 కోట్ల జాయింట్ వెంచర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లోని వేవ్‌రాక్ ఆఫీస్ ప్రాజెక్ట్‌లో సింగపూర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ టిష్‌మెన్ స్పేయర్స్ భారీ పెట్టుబడులు పెట్టింది. ఈ జాయింట్ వెంచర్ విలువ రూ.1,000 కోట్లని టిష్‌మెన్ స్పేయర్స్ ఎండీ, కంట్రీ హెడ్ (ఇండియా) అవినాష్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 2.5 మిలియన్ చ.అ.ల్లో విస్తరించి ఉన్న వేవ్‌రాక్ ప్రాజెక్ట్‌ను దశల వారీగా పూర్తి చేస్తున్నామని.. ఇప్పుటికే ఫేజ్-1, 2ల్లో 1.5 మిలియన్ చ.అ.లను 2010, 2014లో పూర్తి చేశామన్నారు. ఫేజ్-3ను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement