6 వేలకే ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ | Intex Cloud String HD With VoLTE Support Launched at Rs. 5,599 | Sakshi
Sakshi News home page

6 వేలకే ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్

May 24 2016 3:17 PM | Updated on Sep 4 2017 12:50 AM

6 వేలకే  ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్

6 వేలకే ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్‌ క్లౌడ్‌ స్ట్రింగ్‌ హెచ్‌డీ పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.5,599 లుగా కంపెనీ నిర్ణయించింది.

 ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్‌ క్లౌడ్‌ స్ట్రింగ్‌ హెచ్‌డీ పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ని  భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆన్‌లైన్‌ స్టోర్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. దీని ధర రూ.5,599  లుగా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌కి  వీవో ఎల్‌టీఈ (వాయిస్  ఓవర్ )సపోర్ట్‌   కూడా ఉంది.

కాగా  ఇదే ఫీచర్స్ తో ఇంటెక్స్ , ఆక్వాసెక్యూర్  పేరుతో ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.   అయితే  మిర్రర్ గ్లాస్ సపోర్టు తో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అదనపు ఆకర్షణగా నిలవనుంది.

స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్
 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
 ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం
డ్యూయల్ సిమ్ (4జీ + 4జీ)
 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
 1జీబీ ర్యామ్‌
 8జీబీ అంతర్గత మెమొరీ
 ఎస్డీ కార్డుతో మెమొరీని 32జీబీ వరకు పెంచుకునే సదుపాయం
 8 మెగాపిక్సల్‌ ఆటోఫోకస్‌ రేర్‌ కెమేరా
 ఎల్‌ఈడీ ఫ్లాష్‌
 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా
 2200 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 
 

Advertisement
 
Advertisement
Advertisement