breaking news
Rs. 5
-
'లీ మాక్స్ 2' స్మార్ట్ ఫోన్ ధర తగ్గిందోచ్!
న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం ‘లీ ఇకో’ తమ ఫ్లాగ్ షిప్ మొబైల్ పై భారీ ఆఫర్ ప్రకటించింది. పరిమిత కాలానికి గాను లీ ఇకో 'లీ మాక్స్ 2' స్మార్ట్ ఫోన్ పై అయిదు వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. 4జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 1 నుంచి 6వరకు లీ మాల్. కామ్ లో రూ.17,999ల రాయితీ ధర వద్ద లిమిటెడ్ పీరియడ్ లో అందుబాటులో ఉంటుందని బుధవారం ప్రకటించింది. దీంతోపాటు భవిష్యత్తులో లీమాల్, ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యంకాదని, కానీ వచ్చేవారం నుంచి అమెజాన్ ఇండియా, స్నాప్ డీల్ లో అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. అలాగే డిస్కౌంట్ ధరతో లీ మాక్స్ 2 స్మార్ట్ ఫోన్ వేరు వేరు తేదీల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లో అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించింది. అంతే కాదు శుక్రవారం రెండువేల మంది కొనుగోలు దారులకు అదనంగా వెయ్యి రూపాయల వోచర్ అందించేందుకు నిర్ణయించినట్టు తెలిపింది. అలాగే ఫ్లిప్ కార్డ్ బిగ్ బిలియన్ సేల్ లో భాగంగా అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6వరకు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5వరకు, స్నాప్ డీల్ అన్ బాక్స్ దీపావళి అమ్మకాల్లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6 వరకు 'లీ మాక్స్ 2' స్మార్ట్ ఫోన్ ను ఇదే ధరకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. 4జీబీ ర్యామ్ 32 జీవీ స్టోరేజ్ వేరియంట్ ను ఈ ఏడాది జూన్ లో రూ. 22,999 లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే మరో వేరియంట్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ధర రూ. 29,999) ఎలాంటి రాయితీ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ను వేరు వేరు తేదీల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లో అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. కొత్త ఇ-కామర్స్ భాగస్వామ్యాలపై స్పందించిన లీ ఇకో సీవోవో అతుల్ జైన్ ఇది తమ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎత్తుగడ ద్వారా తమ సొంత లీమాల్. కాం ద్వారా భారతదేశం లో అన్ని ప్రధాన ఇ కామర్స్ ప్లాట్ ఫాం లపై ఉనికిని కలిగి ఉన్నామన్నారు. తమ డిస్కౌంట్ ధరను వినియోగదారులు సంతోషంగా స్వీకరిస్తారని నమ్ముతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. -
6 వేలకే ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ క్లౌడ్ స్ట్రింగ్ హెచ్డీ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆన్లైన్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.5,599 లుగా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌కి వీవో ఎల్టీఈ (వాయిస్ ఓవర్ )సపోర్ట్ కూడా ఉంది. కాగా ఇదే ఫీచర్స్ తో ఇంటెక్స్ , ఆక్వాసెక్యూర్ పేరుతో ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అయితే మిర్రర్ గ్లాస్ సపోర్టు తో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. 5 అంగుళాల హెచ్డీ స్క్రీన్ 720×1280 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం డ్యూయల్ సిమ్ (4జీ + 4జీ) 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1జీబీ ర్యామ్ 8జీబీ అంతర్గత మెమొరీ ఎస్డీ కార్డుతో మెమొరీని 32జీబీ వరకు పెంచుకునే సదుపాయం 8 మెగాపిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమేరా ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమేరా 2200 ఎంఏహెచ్ బ్యాటరీ