గ్రామీణ ప్రాంతాలకూ విస్తరణ | Indian Women's Bank Expansion at rural areas | Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రాంతాలకూ విస్తరణ

Feb 28 2014 1:21 AM | Updated on Sep 2 2017 4:10 AM

గ్రామీణ ప్రాంతాలకూ విస్తరణ

గ్రామీణ ప్రాంతాలకూ విస్తరణ

చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచీల ప్రారంభానికి భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

చండీగఢ్: చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచీల ప్రారంభానికి భారతీయ మహిళా బ్యాంక్  (బీఎంబీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు దేశ మొట్టమొదటి మహిళా బ్యాంక్ గురువారం తెలిపింది. తద్వారా 2015 మార్చి నాటికి బ్యాంక్ బ్రాంచీల సంఖ్యను 80కి చేర్చాలన్నది బీఎంబీ లక్ష్యంగా ఉంది. ‘‘మహిళా బ్యాంక్ తన బ్రాండ్‌ను స్థిరపరచుకోవాల్సి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఒక బ్రాంచ్‌ని తక్షణం ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.

తద్వారా దేశ వ్యాప్త విస్తరణను కోరుకుంటున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ద్వితీయ, తృతీయ  శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచీలను ప్రారంభిస్తున్నాం. మార్చి 2015కల్లా కనీసం 80 బ్రాంచీల ఏర్పాటు మా లక్ష్యం’’ అని సీఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ పేర్కొన్నారు. అంతకుముందు ఆమె ఇక్కడ బ్యాంక్ 10వ బ్రాంచ్‌ని ప్రారంభించారు. భారతీయ మహిళా బ్యాంక్‌ను రూ.1,000 కోట్ల తొలి మూలధనంతో ఏర్పాటు చేశారు. 2020 నాటికి రూ.60,000 కోట్ల వ్యాపార పరిమాణం దీని లక్ష్యం.

 మంచి ఆలోచనలతో వస్తే...: మంచి ఆలోచనలతో ముందుకు వచ్చే మహిళలకు రాయితీపై రుణాలను అందించడానికి బ్యాంక్ సిద్ధంగా ఉన్నట్లు సీఎండీ వివరించారు. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు రుణ పథకాలను బ్యాంక్ రూపొందించినట్లు కూడా ఆమె తెలిపారు. హామీ రహిత రుణాలను మహిళలకు ఇవ్వడానికి కూడా తమ బ్యాంక్ సిద్ధంగా ఉంటుందని పేర్కొంటూ... అయితే వారు ఇందుకు మంచి వ్యాపార ఆలోచనలతో ముందుకు రావాల్సి ఉంటుందని వివరించారు.

 మహిళాభివృద్ధే ధ్యేయం
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వంటి వృత్తివిద్యా సంస్థలతో సైతం అవగాహన కుదుర్చుకుని మహిళాభివృద్ధికి బ్యాంక్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయా అంశాల్లో విద్యా రుణాలను ఇవ్వడం, ప్రాక్టీస్ ప్రారంభానికి తోడ్పాటుగా ఒకశాతం వడ్డీ రాయితీతో రుణాలను అందించడం లక్ష్యంగా ఈ దిశలో ముందుకు కదులుతున్నట్లు తెలిపారు.

 మహిళలకు సొంత కారు’ లక్ష్యంగా...
 మహిళల అభ్యున్నతి దిశలో మోటార్ కంపెనీలతోనూ ఒప్పందాలను కుదుర్చుకోడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు ఉషా అనంతసుబ్రమణ్యన్ వెల్లడించారు. మహిళలకు సొంత కారు లక్ష్యంగా షోరూమ్ ధరలో 90 శాతం రుణం వారు పొందేలా చర్యలు తీసుకోవడం ఈ అవగాహన లక్ష్యంగా ఉండబోతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement