స్టాక్‌ మార్కెట్‌ లాభాల బాట.. | Indian Indices Lifted By Buying In Metals Banks And Auto Counters | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌ లాభాల బాట..

Feb 11 2020 12:55 PM | Updated on Feb 11 2020 2:03 PM

Indian Indices Lifted By Buying In Metals Banks And Auto Counters - Sakshi

కరోనా వైరస్‌ భయాలు క్రమంగా వీడటంతో స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.

ముంబై : కరోనా వైరస్‌ భయాలు క్రమంగా వీడుతుండటంతో స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. మెటల్‌, బ్యాంక్‌, ఆటో సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు విస్పష్ట తీర్పు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.

మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 286 పాయింట్ల లాభంతో 41,288 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 98 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,129 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్‌, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభపడుతుండగా..టీసీఎస్‌, నెస్లే ఇండియా స్వల్పంగా నష్టపోతున్నాయి.

చదవండి : ఐపీవోలకు అచ్ఛేదిన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement