ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ లాభం రూ.1,006 కోట్లు 

Indiabulls Housing Finance Q4 net falls 7% - Sakshi

షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్‌ 

ముంబై: దేశంలో రెండో అతిపెద్ద హౌసింగ్‌ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం మార్చి త్రైమాసికంలో 2 శాతం తగ్గింది. రూ.1,006 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.3,658 కోట్ల నుంచి రూ.4,091 కోట్లకు పెరిగింది. 2017–18లో మొత్తం ఆదాయం రూ.14,959 కోట్లుగా ఉంటే, 2018–19లో రూ.17,027 కోట్లకు వృద్ధి చెందాయి.  తిరిగి వృద్ధి పథంలోకి ప్రవేశించామని, రుణ వితరణ సాధారణంగానే కొనసాగుతోందని కంపెనీ వైస్‌ చైర్మన్, ఎండీ గగన్‌బంగా తెలిపారు.

2019–20లో రుణాల్లో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రుణ పుస్తక వృద్ధి నిదానంగానే ఉండాలని తాము తీసుకున్న నిర్ణయం వల్లే రుణాల వితరణ తక్కువగా ఉండడానికి కారణమని గగన్‌బంగా తెలిపారు. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు రూ.10ను మధ్యంతర డివిడెండ్‌గా ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఇక ఈ ఫలితాలను 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూడరాదని కంపెనీ కోరింది. 2017 నవంబర్‌లో ఓక్‌నార్త్‌ బ్యాంకులో వాటాను జీఐసీ సింగపూర్‌కు విక్రయించడం వల్ల రూ.524 కోట్లు గడించినట్టు తెలిపింది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top