సమీప భవిష్యత్తులోనే రెండంకెల వృద్ధి

India will achieve double-digit growth soon: BSE chief Ashishkumar - Sakshi

బీఎస్‌ఈ ఎండీ ఆశిష్‌ చౌహాన్‌

ముంబై: ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు, బ్యాంకింగ్‌ రంగంలో సమస్యలు ఉన్నప్పటికీ స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయని బీఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ అన్నారు. ‘‘బ్యాంకుల పుస్తకాల ప్రక్షాళన జరుగుతోంది. ఎన్‌పీఏల గుర్తింపు పారదర్శకంగా మారింది. వృద్ధి చెందే జీడీపీకి తోడు, జీఎస్టీ, ఐబీసీ వంటి సంస్కరణలతో భారత వృద్ధి త్వరలోనే రెండంకెలకు చేరుతుంది’’ అని చౌహాన్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ వ్యయాలు పెరగడంతో 2016 డిసెంబర్‌ నుంచి వృద్ధి వేగాన్ని అందుకుందని చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, చమురు ధరలతో ఐపీవోలపై ప్రభావం పడిందన్నారు. అయినప్పటికీ అంతర్జాతీయంగా చూస్తే భారత ఎక్స్ఛేంజ్‌ల్లో అధిక ఐపీవో కార్యకలాపాలు ఉన్నాయని, 2018 మొదటి ఆరు నెలల్లో 90 ఐపీవోలు 3.9 బిలియన్‌ డాలర్ల (రూ.26,520 కోట్లు) మేర నిధులు సమీకరించాయని  ఆయన తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top