ఐడియా లాభం రూ.809 కోట్లు | Idea Cellular Q2 net profit up 7% to Rs 809.26 crore | Sakshi
Sakshi News home page

ఐడియా లాభం రూ.809 కోట్లు

Oct 22 2015 12:53 AM | Updated on Sep 3 2017 11:18 AM

ఐడియా లాభం రూ.809 కోట్లు

ఐడియా లాభం రూ.809 కోట్లు

ఐడియా సెల్యులర్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.809 కోట్ల నికర లాభం ఆర్జించింది.

న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.809 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2 నికర లాభం(రూ.759 కోట్లు)తో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది. నాన్ వాయిస్ కాల్స్ ఆదాయం పెరగడం వల్ల నికర లాభంలో వృద్ధి సాధించామని పేర్కొంది. గత క్యూ2లో రూ.7,570 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ  క్యూ2లో రూ.8,689 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అయితే సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.931 కోట్లు)తో పోల్చితే ఈ క్యూ2లో నికర లాభం 13 శాతం క్షీణించింది.
 
రూ.1,727 కోట్ల మూలధన పెట్టుబడులు...
ఈ క్యూ2లో వాయిస్ రేట్ ఈ ఏడాది క్యూ1 వాయిస్ రేట్‌తో పోల్చితే 0.2 పైసలు తగ్గి 32.7 పైసలకు(నిమిషానికి) పడిపోయిందని ఐడియా పేర్కొంది. మొబైల్ డేటా సగటు రియలైజేషన్ ఒక్కో ఎంబీకి 1.2 పైసలు తగ్గి 23.4 పైసలకు (ఒక్కో ఎంబీకి) క్షీణించిందని వివరించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement