పేటీఎం యూజర్లకు ఐసీఐసీఐ రుణాలు

ICICI Loans to PayeeM users - Sakshi - Sakshi - Sakshi

ముంబై: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం ద్వారా కొనుగోళ్లు జరిపే తమ కస్టమర్లకు స్వల్పకాలిక తక్షణ రుణ సదుపాయం అందిస్తున్నట్లు ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ వెల్లడించింది. పేటీఎం ద్వారా కొనుగోళ్లు చేసే వారికి దాదాపు రూ. 20,000 దాకా రుణం అందించనున్నట్లు పేర్కొంది. పేటీఎం–ఐసీఐసీఐ బ్యాంక్‌ పోస్ట్‌ పెయిడ్‌ కార్డ్‌ మీద తీసుకునే రుణంపై తొలి నలభై అయిదు రోజులదాకా వడ్డీ ఉండదని, ఒకవేళ ఆ వ్యవధిలో గానీ చెల్లించకపోతే.. జాప్యానికి గాను రూ. 50 ఫీజుతో పాటు మూడు శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది.

రుణపరిమితి ఒక్క లావాదేవీకి రూ. 20,000 మాత్రమే ఉన్నప్పటికీ.. బకాయిని తీర్చేసిన తర్వాత కస్టమర్‌ మళ్లీ ఈ రుణ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనూప్‌ బాగ్చీ తెలిపారు. ఈ ప్రయోగాన్ని బట్టి ఐసీఐసీఐ బ్యాంక్‌యేతర కస్టమర్లకు, ఇతర పెద్ద వ్యాపార సంస్థలకు కూడా విస్తరించే అవకాశం పరిశీలిస్తామని పేర్కొన్నారు.    

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top