40 ఎంపీ ట్రిపుల్‌-కెమెరాతో హువాయ్‌ స్మార్ట్‌ఫోన్‌

Huawei may soon launch a new smartphone with a 40 MP triple-camera module - Sakshi

గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు రోజురోజుకి మరింత మెరుగ్గా రూపొందుతూ మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ విషయంలో ఐఫోన్‌ కాస్త వెనుకంజలో ఉన్నప్పటికీ, దాన్ని ప్రత్యర్థులు శాంసంగ్‌, గూగుల్‌, హువాయ్‌లు మాత్రం ఆపిల్‌ మించిపోయే ఉన్నాయి. ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న రిపోర్టుల ప్రకారం హువాయ్‌, వచ్చే వారాల్లో ఫోటోగ్రఫీ-సెంట్రిక్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇవాన్‌ బ్లాస్‌ కూడా కొత్త హువాయ్‌ స్మార్ట్‌ఫోన్‌పై ట్వీట్‌ చేశారు.

హువాయ్‌ కొత్తగా తీసుకురాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ వెనుక వైపు 40 ఎంపీ ట్రిపుల్‌-లెన్స్‌ కెమెరా మోడ్యుల్‌ను కలిగి ఉన్నట్టు తెలిపారు. సెల్ఫీ కెమెరా కూడా 24 మెగాపిక్సెల్‌ రూపొందుతుందని పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్‌కు జర్మన్‌ కెమెరా కంపెనీ లైకా కో-డెవలప్డ్‌గా సహకారం అందిస్తుందని ఇవాన్‌ బ్లాస్‌ ట్వీట్‌ చేశారు.  హువాయ్‌ అంతకముందు విడుదల చేసిన పీ10, మేట్‌ 10 స్మార్ట్‌ఫోన్లకు కెమెరా మోడ్యుల్స్‌ను లైకానే అభివృద్ధి చేసింది.   

ట్రిపుల్‌ కెమెరా మోడ్యుల్‌ హ్యువాయ్‌ తీసుకురాబోతున్న తొలి ఫోన్‌. ఈ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లో హువాయ్‌ విజయవంతమవుతుందో లేదోనని టెక్‌ వర్గాలు ఆసక్తికరంగా వేచిచూస్తున్నాయి. జర్మన్‌ కెమెరా తయారీదారి లైకాతో హువాయ్‌ గత కొన్నేళ్లుగా భాగస్వామ్యం కొనసాగిస్తోంది. లైకా భాగస్వామ్యంలో భారత్‌లో తొలిసారి విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌ హువాయ్‌ పీ9.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top