వచ్చే నెల్లో మార్కెట్లోకి  ‘హోండా సివిక్‌’  | Honda Civic relaunch will redefine the sedan market | Sakshi
Sakshi News home page

వచ్చే నెల్లో మార్కెట్లోకి  ‘హోండా సివిక్‌’ 

Feb 23 2019 1:10 AM | Updated on Feb 23 2019 1:10 AM

 Honda Civic relaunch will redefine the sedan market - Sakshi

హైదరాబాద్‌: కారు ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 10వ తరం ‘హోండా సివిక్‌’ను మార్చి 7న మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు హోండా కార్స్‌ ఇండియా ప్రకటించింది. గ్రేటర్‌ నోయిడా ప్లాంట్‌లో ఈ కారు ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించింది. పెట్రోల్, డీజిల్‌ వెర్షన్లలో ఈ కొత్త సివిక్‌ అందుబాటులోకి రానుంది. 1.8 లీటర్‌ ఐ–వీటీఈసీ పెట్రోల్‌ ఇంజిన్, 1.6 లీటర్‌ ఐ–డీటీఈసీ డీజిల్‌ ఇంజిన్లతో నూతన కారు విడుదల కానుండగా.. 6 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్, లీటరుకు 26.8 కిలోమీటర్ల మైలేజీ ఈ కారు ప్రత్యేకతలుగా వెల్లడించింది.

ఈ సందర్భంగా సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ గోయల్‌ మాట్లాడుతూ.. ‘ప్రీ–లాంచ్‌ దశలోనే ఈ కారుకు ఊహించని స్పందన లభిస్తోంది. అంచనాల కంటే అధిక స్థాయిలో ప్రీ–బుకింగ్స్‌ జరిగాయి. వచ్చే నెల 7న కారును మార్కెట్లో విడుదల చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement