
ఏటా 3లక్షల కార్లను విక్రయిస్తాం..
దిగొస్తున్న ఇంధన ధరలకు తోడు వడ్డీరేట్లు తగ్గితే కార్ల అమ్మకాల....
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దిగొస్తున్న ఇంధన ధరలకు తోడు వడ్డీరేట్లు తగ్గితే కార్ల అమ్మకాల వృద్ధి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో హిరినొరి కనయమ తెలిపారు. 2017 నాటికి ఇండియాలో ఏటా మూడు లక్షల కార్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ నాటికి కార్ల అమ్మకాలు 43 శాతం పెరిగి 1.01 లక్షలకు చేరాయి. సికింద్రాబాద్‌లో 200వ డీలర్‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కనమయ విలేకరులతో మాట్లాడుతూ వచ్చే 16 నెలల్లో మరో 100 డీలర్లను తమ నెట్‌వర్క్‌లోకి చేర్చుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏడు, తెలంగాణలో ఏడుగురు చొప్పున డీలర్లు ఉన్నారు.
జాజ్ విడుదలపై: హచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కి చెందిన జాజ్ విడుదల మరింత ఆలస్యం కానున్నట్లు కనయమ తెలిపారు. ఈ మధ్యనే విడుదల చేసిన మొబిలియో, అమేజ్, హోండా సిటీలకు డిమాండ్ అధికంగా ఉండటంతో జాజ్ విడుదల మరో ఏడాది ఆలస్యం కావచ్చన్నారు. తొలుత జాజ్‌ను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ ఊహించినదానికంటే మొబి లియో, అమేజ్‌లకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ కార్లను ఉత్పత్తి చేయడానికి రెండో షిప్ట్‌ను కూడా కొనసాగించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలు 50:50 నిష్పత్తిలో ఉన్నాయని, రానున్న కాలంలో 60:40కి మారవచ్చని అంచనా వేశారు.