హోండా యాక్టివా @ కోటి అమ్మకాలు | Honda Activa achives crore sales | Sakshi
Sakshi News home page

హోండా యాక్టివా @ కోటి అమ్మకాలు

Aug 19 2015 1:27 AM | Updated on Sep 3 2017 7:40 AM

హోండా యాక్టివా @ కోటి అమ్మకాలు

హోండా యాక్టివా @ కోటి అమ్మకాలు

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) కంపెనీ యాక్టివా స్కూటర్ మోడల్ కోటి అమ్మకాల మైలురాయిని సాధించింది...

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) కంపెనీ యాక్టివా  స్కూటర్ మోడల్ కోటి అమ్మకాల మైలురాయిని సాధించింది. 2001లో ఈ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. భారత్‌లో స్కూటర్ సెగ్మెంట్‌కు పునరుత్తేజం ఇచ్చిన ఈ మోడల్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉందని వివరించారు. పదేళ్ల క్రితం భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టూవీలర్‌గా స్కూటర్ మోడల్ నిలుస్తుందని ఎవరూ ఊహించలేదని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ సింగ్ గులేరియా చెప్పారు. మార్కెట్లోకి తెచ్చిన  తొలి ఏడాదిలోనే 55 వేల యాక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయని, దేశీయ మార్కెట్లో  గతేడాది 21 లక్షలు అమ్ముడయ్యాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement