హీరో స్ల్పెండర్‌ ప్లస్‌, కొత్త వెర్షన్‌

Hero MotoCorp launches BS VI compliant Splendor plus    - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   ప్రముఖ  ద్విచక్ర వాహన తయారీ సంస్థ  హీరో మోటోకార్ప్ తన పాపులర్‌ మోడల్‌  స్ల్పెండర్‌ ప్లస్‌ను బీఎస్‌-6  వెర్షన్‌  ఇంజీన్‌తో లాంచ్‌ చేసింది. దేశీయంగా  త్వరలో అమలుకానున్న కొత్త ఉద్గార నిబంధనల నేపథ్యంలో ఈ  బైక్‌ను శుక్రవారం  విడుదల చేసింది.  ధర రూ .59,600 నుండి ప్రారంభమవుతుంది. దీంతో పాటు బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా రెండు స్కూటర్లను కూడా తీసుకొచ్చింది.  డెస్టినీ 125,  మాస్ట్రో ఎడ్జ్ 125  పేరుతో తీసుకొచ్చిన  వీటి ధరలను  వరుసగా రూ .64,310 ,  రూ .67,950 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌ న్యూఢిల్లీ) ప్రారంభమవుతుందని హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో తెలిపింది.  కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించామని హీరో మోటోకార్ప్ హెడ్ (గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్) మాలో లే మాసన్ అన్నారు. జైపూర్‌లోని ఆర్‌అండ్‌డీ హబ్ - సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (సిఐటి) వద్ద  వీటిని పూర్తిగా  దేశీయంగా డిజైన్ చేసి అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top