ట్రిలియన్‌ దాటిన జీఎస్‌టీ వసూళ్లు  | GST collection crosses Rs 1 trillion in October  | Sakshi
Sakshi News home page

ట్రిలియన్‌ దాటిన జీఎస్‌టీ వసూళ్లు 

Nov 1 2018 2:19 PM | Updated on Nov 1 2018 2:30 PM

GST collection crosses Rs 1 trillion in October  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: పండుగ సీజన్లో వినియోగదారుల డిమాండ్ పెరగడంతో జీఎస్‌టీ వసూళ్లు మరోసారి   ట్రిలియన్‌ మార్క్‌ను  అధిగమించాయి. సెప్టెంబర్‌లో రూ. 94,442 కోట్ల పోలిస్తే  అక్టోబర్‌ నెలలో బాగా పుంజుకుని  లక్ష కోట్ల రూపాయిలను దాటాయి.  6.64 శాతం పెరిగి  అక్టోబర్‌ నెలలో  రూ. 1,00,700 కోట్లకు చేరాయి. 

సీజీఎస్‌టీ రూ. 16,464 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్‌టీ రూ. 22,826 కోట్లు. ఉమ్మడి అంటే ఐజీఎస్టీ వసూళ్లు రూ. 53,419 కోట్లు. ఇందులో ఎగుమతుల ద్వారా రూ. 26,908 కోట్లు. సెస్‌ రూపంలో రూ. 8,000 కోట్లు వసూలయ్యాయి. ద్రవ్య లోటు లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆపసోపాలు పడుతున్నప్రభుత్వానికి ఇది ఊరట నిచ్చే అంశం.   కాగా ఈ ఏడాదిలో లక్షకోట్ల వసూళ్లను దాటం ఇది రెండవ సారి. ఈ ఆర్థిక సంవత్సరంలో  ఏప్రిల్‌ నెలలో తొలిసారి  ట్రిలియన్‌ రూపాయల జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement