క్రిప్టోకరెన్సీలపై కేంద్రం కీలక నిర్ణయం

Govt to bar cryptocurrencies from its payments system - Sakshi

న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. పేమెంట్‌ సిస్టమ్‌లోకి క్రిప్టోకరెన్సీలను అనుమతించకూడదని చర్యలు తీసుకుంటుంది. అంతేకాక ఓ ప్యానల్‌ను కూడా ప్రభుత్వం నియమించింది. క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన అంశాలన్నింటినీ ఈ ప్యానల్‌ పరిశీలించనుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు ఈ రిపోర్టును ప్యానల్‌ ప్రభుత్వానికి సమర్పించనుందని ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ ఎస్‌.సీ గార్గ్‌ తెలిపారు. పేమెంట్‌ సిస్టమ్‌లో వీటిని చట్టవిరుద్దమైనవిగా పరిగణించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.  అదేవిధంగా ''క్రిప్టో ఆస్తులు'' ట్రేడ్‌ అయ్యే అన్‌రెగ్యులేటెడ్‌ ఎక్స్చేంజ్‌లను రెగ్యులేట్‌ చేయాలని కూడా ప్రభుత్వం చూస్తోంది. 

ఈ ఆర్థిక సంవత్సరంలోనే కమిటీ తన ప్రతిపాదనలను ఖరారు చేయనుందని గార్గ్‌ చెప్పారు. క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధమైనవిగా తాము గుర్తించమని ప్రభుత్వం ఇటీవల తన బడ్జెట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి క్రిప్టో ఆస్తులను వాడకాన్ని కూడా ప్రభుత్వం నిర్మూలిస్తోందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు.  ఈ డిజిటల్‌ కరెన్సీ పెట్టుబడులపై ప్రభుత్వం వార్నింగ్‌లు ఇస్తూనే ఉంది. ఇవి ''పోంజి స్కీమ్‌'' లుగా పేర్కొంటోంది. అయితే క్రిప్టో ఎక్స్చేంజ్‌లను రెగ్యులేట్‌ చేయాలనుకోవడం శుభ పరిణామం అని ఇండస్ట్రి బాడీ, క్రిప్టో కరెన్సీ కమిటీ, బ్లాక్‌చైన్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ కురానా అన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top