మెరుపు తగ్గిన గోల్డ్‌ ఈటీఎఫ్‌లు!

Gold ETFs see Rs 150 crore outflow in Q1 - Sakshi

న్యూఢిల్లీ:  గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో (ఈటీఎఫ్‌) అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌– జూన్‌ త్రైమాసికంలో రూ.146 కోట్ల మేర బంగారం ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో బంగారం ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ 12 శాతం క్షీణించి రూ.4,567 కోట్లకు తగ్గింది.

ఇది అంతకు ముందు ఏడాది జూన్‌ నాటికి రూ.5,174 కోట్లుగా ఉంది. ఏప్రిల్‌లో రూ.54 కోట్లు, మేలో రూ.38 కోట్లు, జూన్‌లో రూ.54 కోట్ల మేర ఉపసంహరణలు ఉన్నాయి. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బంగారం ఈటీఎఫ్‌ విభాగంలో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే రావటం గమనార్హం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top