మస్కట్‌కు డైరెక్ట్‌ ఫ్లైట్‌ : గోఎయిర్‌ ఆఫర్‌

GoAir Announces New International Flights, Offers Tickets From Rs. 4,999 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విమానయాన రంగంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఎయిర్‌లైన్‌ సంస్థలు ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌  గో ఎయిర్‌ అంతర్జాతీయ విమాన టికెట్లపై రాయితీ ధరలను ప్రకటించింది. ముఖ్యంగా కేరళలోని కన్నూరు -మస్కట్‌- కన్నూరు మధ్య నడిచే విమానాలకు ఈ ధరలు వర్తించనున్నాయి.

ఫిబ్రవరి 28 నుంచి వారానికి  మూడు (మంగళ, గురు, శని వారాల్లో) డైరెక్ట్‌ విమాన సర్వీసులను  నడుపుతుంది.  అన్ని చార్జీలు కలుపుకుని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ టికెట్‌ ధరలు (ఒకవైపు)  రూ.4999 నుంచి ప్రారంభం అవుతాయని గో ఎయిర్‌ వెల్లడించింది.  తక్షణమే అంటే ఈ రోజు (జనవరి 19) నుంచి ఈ డిస్కౌంట్‌ ధరల్లో టికెట్లు లభ్యమవుతాయని తెలిపింది. మరిన్ని వివరాలు గోఎయిర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top