జీఎంఆర్‌ నష్టం రూ. 566 కోట్లు 

GMR loss is Rs. 566 crores - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 566 కోట్ల నికర నష్టం (కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ రూ. 643 కోట్ల లాభం నమోదు చేసింది.

ఇక తాజా క్యూ3లో ఆదాయం కూడా రూ. 2,587 కోట్ల నుంచి రూ. 2,296 కోట్లకు క్షీణించింది. అటు మొత్తం వ్యయాలు రూ. 2,624 కోట్ల నుంచి రూ. 2,488 కోట్లకు తగ్గాయి. బుధవారం బీఎస్‌ఈలో జీఎంఆర్‌ షేరు 1.75 శాతం నష్టంతో రూ. 19.70 వద్ద ముగిసింది.  

Back to Top