బడ్జెట్‌లో మాకూ చోటివ్వండి! | give place we in budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో మాకూ చోటివ్వండి!

Nov 8 2014 1:51 AM | Updated on Sep 2 2017 4:02 PM

బడ్జెట్‌లో మాకూ చోటివ్వండి!

బడ్జెట్‌లో మాకూ చోటివ్వండి!

తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌లో భవన నిర్మాణ కార్మికుల....

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి నిధులను కేటాయించాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు గంధం అంజన్న కోరారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1.25 లక్షల మంది ఉన్న భవన కార్మికులు సొంత గూడు లేక గుడిసెల్లో, అద్దె ఇళ్లలో నివాసముంటున్నారని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులందరికీ 120 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. అనారోగ్య సమస్యలు, ప్రమాదవశాత్తు ఎంతో మంది కార్మికులు మరణిస్తున్నారని అందుకే వారి ఆరోగ్యరీత్యా ఆరోగ్య కార్డులు కేటాయించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement