వృద్ధి రేటు 6 - 6.5శాతం : ఆర్థిక సర్వే | Sakshi
Sakshi News home page

వృద్ధి రేటు 6- 6.5శాతం : ఆర్థిక సర్వే

Published Fri, Jan 31 2020 2:18 PM

GDP To Grow 6 to 6.5 Percent In 2020-21 Says By Economic Survey - Sakshi

సాక్షి, న్యూడిల్లీ:  దేశ వృద్ధి రేటు రానున్న ఆర్థిక సంవత్సరం (2020-21)కు   6నుంచి 6.5శాతం నమోదవుతుందని  ఆర్థిక సర్వే అంచనా వేసింది.  పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2025 సంవత్సారానికల్లా దేశం నిర్దేశించుకున్న5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సర్వే పై రాషష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. రేపు (శనివారం) ఉదయం 11.గంటలకు ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఆర్థిక సర్వే హేతుబద్ద పరిష్కార మార్గాలు సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు సంబంధించిన స్థితిగతులను తెలుసుకోవడంలో ఆర్థిక సర్వే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని సర్వే అభిప్రాయపడింది. తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తే దేశంలో ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందని తెలిపింది. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement