7సీస్ నుంచి 3డీ వీడియో యానిమేషన్ ఫిల్మ్ ‘లవ్‌స్టార్’ | Game Development Company 7 Seas Entertainment lounches Love Star | Sakshi
Sakshi News home page

7సీస్ నుంచి 3డీ వీడియో యానిమేషన్ ఫిల్మ్ ‘లవ్‌స్టార్’

Feb 16 2016 2:36 AM | Updated on Sep 3 2017 5:42 PM

7సీస్ నుంచి 3డీ వీడియో యానిమేషన్ ఫిల్మ్ ‘లవ్‌స్టార్’

7సీస్ నుంచి 3డీ వీడియో యానిమేషన్ ఫిల్మ్ ‘లవ్‌స్టార్’

ఐపీ ఆధారిత గేమ్ డెవలప్‌మెంట్ కంపెనీ 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ తాజాగా యానిమేటెడ్ 3డీ వీడియో ఫిల్మ్ లవ్‌స్టార్‌ను రూపొందించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐపీ ఆధారిత గేమ్ డెవలప్‌మెంట్ కంపెనీ 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ తాజాగా యానిమేటెడ్ 3డీ వీడియో ఫిల్మ్ లవ్‌స్టార్‌ను రూపొందించింది. యూ ట్యూబ్, డిజిటల్ మీడియాలలో యానిమేషన్ క్యారెక్టర్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వినోదాన్ని అందించే క్యారెక్టర్‌ను అభివృద్ధి చేసినట్టు కంపెనీ తెలిపింది. దేఖో దేఖో అంటూ అయిదు భాషల్లో సాగిన పాటతో కూడిన వీడియో నిడివి 3 నిముషాల 30 సెకన్లు. రజనీకాంత్, అమితాబ్, ప్రభాస్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీయార్ వంటి 18 మంది సినీ హీరోల నృత్యరీతులు, అనుకరణ వీక్షకులకు ఆనందాన్ని పంచుతుందని కంపెనీ ఎండీ ఎల్.మారుతీ శంకర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ తరహాలో యానిమేషన్ సాంగ్ రావడం తొలిసారి అని పేర్కొన్నారు. డ్యూయట్ మాదిరిగా సాగిన ఈ వీడియోలో కొన్ని స్టెప్పుల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడారు. హేమచంద్ర, శ్రావణ భార్గవి దేఖో దేఖో పాటను పాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement