breaking news
love star
-
7సీస్ నుంచి 3డీ వీడియో యానిమేషన్ ఫిల్మ్ ‘లవ్స్టార్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐపీ ఆధారిత గేమ్ డెవలప్మెంట్ కంపెనీ 7సీస్ ఎంటర్టైన్మెంట్ తాజాగా యానిమేటెడ్ 3డీ వీడియో ఫిల్మ్ లవ్‌స్టార్‌ను రూపొందించింది. యూ ట్యూబ్, డిజిటల్ మీడియాలలో యానిమేషన్ క్యారెక్టర్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వినోదాన్ని అందించే క్యారెక్టర్‌ను అభివృద్ధి చేసినట్టు కంపెనీ తెలిపింది. దేఖో దేఖో అంటూ అయిదు భాషల్లో సాగిన పాటతో కూడిన వీడియో నిడివి 3 నిముషాల 30 సెకన్లు. రజనీకాంత్, అమితాబ్, ప్రభాస్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీయార్ వంటి 18 మంది సినీ హీరోల నృత్యరీతులు, అనుకరణ వీక్షకులకు ఆనందాన్ని పంచుతుందని కంపెనీ ఎండీ ఎల్.మారుతీ శంకర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ తరహాలో యానిమేషన్ సాంగ్ రావడం తొలిసారి అని పేర్కొన్నారు. డ్యూయట్ మాదిరిగా సాగిన ఈ వీడియోలో కొన్ని స్టెప్పుల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడారు. హేమచంద్ర, శ్రావణ భార్గవి దేఖో దేఖో పాటను పాడారు. -
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన 'లవ్ స్టార్'
-
యానిమేషన్ చిత్రాం 'లవ్ స్టార్'
ప్రస్తుతం యానిమేషన్ చిత్రాలకు బాగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే తెలుగులో కూడా యానిమేషన్ చిత్రాల నిర్మాణం జోరందుకుంది. ‘లవ్స్టార్’ పేరుతో సెవెన్సీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మారుతిశంకర్ యానిమేషన్ చిత్రం చేస్తున్నారు. బూరుగుపల్లి సత్యనారాయణ దర్శకుడు. ఇందులో లవ్స్టార్ అనే యానిమేటెడ్ కార్టూన్ పాత్ర అందర్నీ అలరిస్తుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమా తర్వాత ‘యోధ’ పేరుతో మరో భారీ యానిమేటెడ్ చిత్రం చేస్తామని నిర్మాత తెలిపారు.