పెట్రోల్, డీజిల్‌పై 50 శాతం పెరిగిన ఎక్సైజ్ వసూళ్లు | Excise collection on petrol, diesel up 50% at Rs 74.5K cr | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్‌పై 50 శాతం పెరిగిన ఎక్సైజ్ వసూళ్లు

May 9 2015 2:15 AM | Updated on Jul 11 2019 8:43 PM

పెట్రోల్, డీజిల్‌పై 50 శాతం పెరిగిన ఎక్సైజ్ వసూళ్లు - Sakshi

పెట్రోల్, డీజిల్‌పై 50 శాతం పెరిగిన ఎక్సైజ్ వసూళ్లు

పెట్రోల్, డిజిల్‌పై ఎక్సైజ్ సుంకాల వసూళ్లు గడచిన ఆర్థిక సంవత్సరం (2014-15)లో 50 శాతం పెరిగాయి.

న్యూఢిల్లీ: పెట్రోల్, డిజిల్‌పై ఎక్సైజ్ సుంకాల వసూళ్లు గడచిన ఆర్థిక సంవత్సరం (2014-15)లో 50 శాతం పెరిగాయి. 2014-15లో ఈ సుంకాల వసూళ్ల మొత్తం రూ.74.5 కోట్లని లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. వేర్వేరుగా పెట్రోల్ విషయంలో ఈ మొత్తం రూ.22,424 కోట్ల నుంచి రూ.31,165 కోట్లకు ఎగసింది. డీజిల్‌కు సంబంధించి సుంకాల వసూళ్లు రూ. భారీగా రూ.27,146 కోట్ల నుంచి రూ.43,300 కోట్లకు పెరిగింది. ఆదాయాలను పెంచుకోవడంలో లక్ష్యంగా కేంద్రం పలు దఫాలు సుంకాలు పెంచడం దీనికి ప్రధాన కారణం.

Advertisement
 
Advertisement
Advertisement