పెళ్లికి పీఎఫ్‌ మనీ తీసుకోవచ్చు

EPFO Allows Members To Withdraw Funds For Marriage - Sakshi

న్యూఢిల్లీ : ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌ఓ) తన సభ్యులకు నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది. ఇటీవలే నిరుద్యోగిగా మారిన నెల అనంతరం 75 శాతం ఈపీఎఫ్‌ కార్పస్‌ను, 2 నెలలకు పైగా నిరుద్యోగిగా ఉంటే మిగతా ఆ 25 శాతం కూడా విత్‌డ్రా చేసుకునేలా అవకాశం కల్పించిన ఈపీఎఫ్‌ఓ మరో అద్భుత అవకాశాన్ని కూడా కల్పించబోతుంది. పెళ్లికి, ఇంటి కొనుగోలుకు, పిల్లల చదువుకు వంటి ఖర్చులకు సగం ఈపీఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేలా ఈపీఎఫ్‌ఓ అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే నగదును విత్‌డ్రా చేసుకునేందుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఫార్మ్‌ 31ను నింపాల్సి ఉంటుంది. 

పోస్టు మెట్రిక్యూలేషన్‌ స్టడీస్‌ కోసం 50 శాతం మొత్తాన్ని వడ్డీతో తీసుకునేలా ఈపీఎఫ్‌ఓ తన నిబంధనలను మార్చుతోంది. అలాగే ఇళ్లు కొనుకునేందుకు లేదా కట్టించుకునేందుకు కూడా 24 నెలల బేసిక్‌ వేతనాలను, డీఏను విత్‌డ్రా చేసుకోవచ్చని రిటైర్‌మెంట్‌ ఫండ్‌ బాడీ చెప్పింది. 24 బేసిక్‌, డీఏ లేదా 36 నెలల బేసిక్‌ వేతనాలను విత్‌డ్రా చేసుకునేలా ఈపీఎఫ్‌ఓ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. అయితే పీఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే కనీసం ఐదేళ్లు సభ్యుడిగా ఉండాలి. దీని కోసం ఉద్యోగి నుంచి డిక్లరేషన్‌ అవసరం. మిగతా ఏ డాక్యుమెంట్లను ఉద్యోగులు సమర్పించాల్సినవసరం లేదు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top