
న్యూయార్క్ : వాల్ట్ డిస్నీ కంపెనీ, 21వ శతాబ్దపు ఫాక్స్ ఫిల్మ్‌ను సొంతం చేసుకుంది. స్టాక్ 52.4 బిలియన్ డాలర్లకు డీల్ కుదుర్చుకున్నట్టు వాల్ట్ డిస్నీ నేడు ప్రకటించింది. ఫిల్మ్, టెలివిజన్ స్టూడియో, కేబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్, ఇంటర్నేషనల్ టీవీ బిజినెస్, ఎక్స్-మెన్, అవతార్, ఎఫ్‌ఎక్స్ నెట్‌వర్క్స్, నేషనల్ జియోగ్రఫీ వంటి వన్నీ ఈ డీల్‌లో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇవి డిస్నీ పోర్టుఫోలియోలోకి వెళ్లాయి. ఈ విక్రయానికి ముందు ఫాక్స్ టెలివిజన్ స్టేషన్స్, ఫాక్స్ న్యూస్ ఛానల్ విడిపోయాయి.
21వ శతాబ్దపు ఫాక్స్ కొనుగోలు, వినోదభరితమైన అనుభవాల్లో వినియోగదారుల డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందని డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ ఐగెర్ ఓ ప్రకటనలో చెప్పారు. 2019లో ఐగెర్ పదవీ విరమణ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ 2021 వరకు ఆయన తన పదవిలో కొనసాగబోతున్నట్టు తెలుస్తోంది. హలీవుడ్‌లో మేజర్ స్టూడియోస్‌గా ఉన్న ఏబీసీ టెలివిజన్ నెట్‌వర్క్, ఈఎస్‌పీఎన్‌ను డిస్నీ తన సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌కు పోటీగా తన సొంత స్ట్రీమింగ్ సర్వీసులను లాంచ్ చేసేందుకూ డిస్నీ సిద్దమవుతోంది.