
న్యూఢిల్లీ: రెండేళ్లు పైబడిన స్థిర డిపాజిట్‌లపై వడ్డీరేట్లను ఎస్‌బీఐ పెంచింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా కొన్ని మెచ్యూరిటీల డిపాజిట్ రేట్లను ఎస్‌బీఐ పెంచడం గమనార్హం. తాజా నిర్ణయం ప్రకారం– రెండేళ్లు పైబడిన స్థిర డిపాజిట్లపై రేట్లు 10 నుంచి 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగాయి.
రెండేళ్ల నుంచి పదేళ్ల కాలానికి మధ్య కోటిలోపు డిపాజిట్లపై ఇకపై 6.6 శాతం నుంచి 6.75 శాతం శ్రేణిలో వడ్డీ రాబడి ఉంటుంది. వృద్ధులకు 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీరేటు అమలవుతుంది. పెరిగిన రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయి.