ఆర్థిక పరిస్థితి గాడిలో పడ్డాకే... | Sakshi
Sakshi News home page

ఆర్థిక పరిస్థితి గాడిలో పడ్డాకే...

Published Fri, Jul 11 2014 2:58 PM

ఆర్థిక పరిస్థితి గాడిలో పడ్డాకే... - Sakshi

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితి మెరుగుపడిన తర్వాత బంగారం దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అయితే వెంటనే ఆంక్షలు సడలించే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి కుదటపడనంత వరకు ఆంక్షలు ఎత్తివేయడం సాధ్యం కాదని అన్నారు. కరెంట్ ఎకౌంట్ లోటు(సీఏడీ), ఆర్థిక లోటుపై తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు.

బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని గతేడాది ఆగస్టు నుంచి 10 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దిగుమతి సుంకం పెంచడంతో  2013-14లో ఈ రెండు లోహాల దిగుమతులు 40% క్షీణించాయన్నాయి. కాగా, సుంకాన్ని 10 నుంచి 2 శాతానికి తగ్గించాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) కేంద్రాన్ని కోరింది.

Advertisement
Advertisement