ఆర్థికవ్యవస్థ భారీ వృద్ధితోనే దేశం ముందడుగు వేస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కె.వి.కామత్ చెప్పారు.
	 హైదరాబాద్, సిటీబ్యూరో:  ఆర్థికవ్యవస్థ భారీ వృద్ధితోనే దేశం ముందడుగు వేస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కె.వి.కామత్ చెప్పారు. ఐఐఎం అహ్మదాబాద్ వ్యవస్థాపకులు రవి మథాయి మూడవ స్మారకోపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ స్థాపించినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ బాగాలేదని, దీని ఏర్పాటు ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను సరళీకరించటంతో పాటు, ఉపాధి అవకాశాలు పెంచడానికి, పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం లభించిందని చెప్పారాయన. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే  గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
