ఫిబ్రవరిలో 22.7 లక్షల మంది కొత్త మొబైల్‌ వినియోగదారులు | COAI to urge Telecom Minister to relax Q4 license fee payout | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో 22.7 లక్షల మంది కొత్త మొబైల్‌ వినియోగదారులు

Mar 24 2017 12:34 AM | Updated on Sep 5 2017 6:54 AM

ఫిబ్రవరిలో 22.7 లక్షల మంది కొత్తగా మొబైల్‌ వినియోగదారులయ్యారని సీఓఏఐ తెలిపింది.

న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో 22.7 లక్షల మంది కొత్తగా మొబైల్‌ వినియోగదారులయ్యారని సీఓఏఐ తెలిపింది. దీంతో మొత్తం మొబైల్‌ వినియోగదారుల సంఖ్య 81.74 కోట్లకు పెరిగిందని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌(సీఓఏఐ) తెలిపింది. రిలయన్స్‌ జియో వినియోగదారుల వివరాలను వెల్లడించలేదు.

గణాంకాల ప్రకారం... భారతీ ఎయిర్‌టెల్‌కు 12.5 లక్షల మంది కొత్త మొబైల్‌ వినియోగదారులు లభించారు. గత నెలలో అత్యధిక కొత్త మొబైల్‌ వినియోగదారులను సాధించిన కంపెనీ ఇదే. ఐడియాకు 12.1 లక్షల మంది, వొడాఫోన్‌కు 7.9 లక్షల మంది చొప్పున కొత్త యూజర్లు జతయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement