నెమ్మదించిన చైనా జీడీపీ!

China Q2 GDP growth slows, meet forecast - Sakshi

క్యూ–2లో 6.7 శాతంగా నమోదు  

బీజింగ్‌: చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు స్వల్పంగా తగ్గింది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో(ఏప్రిల్‌–జూన్‌) జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైనట్లు ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో జీడీపీ 6.8 శాతం కాగా, అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈ సారి స్వల్ప తగ్గుదల చోటుచేసుకుందని చైనా ప్రభుత్వం వెల్లడించింది.

అయితే, ఈ తగ్గుదల త్రైమాసికం పరంగా చూసినప్పుడే ఉందని.. ఏడాది పరంగా తాము నిర్దేశించుకున్న 6.5 శాతానికి మించే ఉందని వెల్లడించింది.పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున తమ కేంద్ర బ్యాంక్‌ చిన్న సంస్థలకు ఆర్థికంగా అందిస్తున్న సహాయాన్ని పెంచినట్లు తెలియజేసింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భాగంగా వడ్డీరేట్లలో కోత ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌.. అమెరికా– చైనా వాణిజ్య యుద్ధం కారణంగా మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతిందని, చైనా ఫిక్సిడ్‌ అసెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వృద్ధిరేటు తొలి అర్ధభాగంలో అత్యంత కనిష్టస్థాయి అయిన 6 శాతానికి పడిపోయిందని తెలిపింది. చైనా కరెన్సీ యువాన్‌ పతనం అక్కడి వినియోగదారులకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఎగుమతిదారులకు మాత్రం ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించింది.   

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top