సెల్‌కాన్ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో.. | Celkon smartphone With 5,000 MAH battery | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో..

Jun 20 2015 1:17 AM | Updated on Sep 3 2017 4:01 AM

సెల్‌కాన్ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో..

సెల్‌కాన్ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో..

మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్ మొబైల్స్.. మిలీనియా సిరీస్‌లో క్యూ5కే పవర్ పేరుతో 3జీ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారమిక్కడ ఆవిష్కరించింది.

క్యూ5కే పవర్ ధర రూ.5,222
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్ మొబైల్స్.. మిలీనియా సిరీస్‌లో క్యూ5కే పవర్ పేరుతో 3జీ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారమిక్కడ ఆవిష్కరించింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకత. బ్యాటరీ స్టాండ్ బై 15 రోజులు. ఒకసారి చార్జింగ్ చేస్తే 24 గంటలపాటు మాట్లాడుకోవచ్చు. 5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యువీజీఏ ఐపీఎస్ డిస్‌ప్లే, కిట్‌క్యాట్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టమ్, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆటో ఫోకస్‌తో 5 ఎంపీ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.

డ్యూయల్ సిమ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, వైఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్, కస్టమైజ్డ్ గెస్చర్ కంట్రోల్స్ ఇతర విశిష్టతలు. ధర రూ.5,222. వినియోగదారులకు అత్యుత్తమ మోడళ్లను అందుబాటు ధరలో అందించ డాన్ని తాము కొనసాగిస్తున్నామని సెల్‌కాన్ మొబైల్స్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. రూ.10 వేలలోపు ధరలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ మోడల్ లభించడం భారత్‌లో ఇదే తొలిసారి అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement