పైకప్పు అదిరింది!

Ceiling designs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డ్యూప్లెక్స్, ఫ్లాట్లలో పడక గదులకు ఫాల్స్‌ సీలింగ్‌ అధికమవుతోంది. ఇది మీ అభిరుచులకు అద్దం పట్టాలంటే మాత్రం సీలింగ్‌ డిజైన్‌తో పాటూ సరైన వర్ణాల్ని ఎంచుకోవాలి. ఫాల్స్‌ సీలింగ్‌ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పరడడం, అలసిన మనసు, శరీరానికి స్వాంతన చేకూర్చడమే! సరైన రంగుల కలయికతో ఆశించిన రూపాన్ని ఆవిష్కరించుకోవచ్చు. దీంతో మనసుకు ఆకట్టుకునే సీలింగ్‌ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పైకప్పు విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. పైకప్పును మృదువైన వర్ణాలు వేస్తే ఆ రూపం ఆనందమయం అవుతుంది.

మిగతా గదులతో పోలిస్తే పడక గది సీలింగ్‌నే ఎక్కువ సేపు చూస్తాం. కాబట్టి, వర్ణాల ఎంపికలో కూడా విజ్ఞత పాటించాలి. సాదాసీదా రంగులు కాకుండా నేటి పోకడలకు అద్దం పట్టేవి ఎంచుకోవాలి. ఇది మీ మనసులోని భావాలకు ప్రతీకగా నిలవాలి.
మధ్యస్తం, డార్క్‌ బ్రౌన్‌ వర్ణాలు పడక గదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి. బిగీస్, బ్రౌన్స్, టాన్స్‌ వాడండి. ఇవి పుడమి రూపాన్ని తలపిస్తాయి. కొండలు, రాళ్లు, మట్టి రూపాల్ని ప్రతిబింబిస్తాయి.  
 ఆకుపచ్చ, బ్రౌన్‌ మిశ్రమం పడకగదిని అద్భుతంగా మారుస్తుంది. గదిలో ఆత్మీయత భావనను కలిగిస్తుంది. ఆకుపచ్చలో సరైన షేడ్లను ఎంచుకోవాలి. ఎందుకంటే కొన్ని షేడ్లు వర్ణస్థాయిని తక్కువ చేస్తాయి.

వర్ణాల ఎంపికలో..
 గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడే పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉన్న భావన కలుగుతుంది.
 తాజాదనం ఉట్టిపడుతున్న లుక్‌ రావాలంటే.. మోనో క్రోమోటిక్‌ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు రంగులు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సీలింగ్‌ ప్రశాతం భావనను కలిగిస్తుంది.
 పైకప్పునకు తెలుపు రంగు కూడా వేసుకోవచ్చు. కానీ, సంప్రదాయ పద్ధతి. నేటి పోకడలకు అద్దం పట్టదని గుర్తుంచుకోండి. గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గరదగ్గర రంగులు కాకుండా చూడగానే ఇట్టే కన్పించాలి. అంటే లేత గులాబీ, లేత ఎరుపు వర్ణాలాంటివన్నమాట.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top