సీడీఆర్ నుంచిబయటపడ్డ ఎన్సీఎల్ | Sakshi
Sakshi News home page

సీడీఆర్ నుంచిబయటపడ్డ ఎన్సీఎల్

Published Wed, May 25 2016 1:09 AM

సీడీఆర్ నుంచిబయటపడ్డ ఎన్సీఎల్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు రంగ సంస్థ ఎన్‌సీఎల్ ఎట్టకేలకు కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ (సీడీఆర్) ప్యాకేజి పరిధి నుంచి బైటపడింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సీడీ) జారీ ద్వారా పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి సమీకరించిన రూ. 325 కోట్ల నిధుల్లో సుమారు రూ. 125 కోట్లను రుణబకాయిల చెల్లింపు కింద బ్యాంకర్లకు ఇచ్చినట్లు సంస్థ పేర్కొంది. మిగతా మొత్తాన్ని సిమెంటు ప్లాంట్ల విస్తరణ కోసం వినియోగించనున్నట్లు ఎన్‌సీఎల్ వివరించింది. నాగార్జున బ్రాండ్ సిమెంటు తయారీ సంస్థ ఎన్‌సీఎల్ సుమారు రూ.122 కోట్ల రుణబకాయిలకు సంబంధించి 2013లో సీడీఆర్  మార్గాన్ని ఎంచుకుంది.

Advertisement
Advertisement